తెలంగాణలో చివరి బోనాలు

తెలంగాణలో చివరి బోనాలు

 తెలంగాణలో  చివరి బోనాల పండుగగా మన చందుపట్ల (manachandupatla) గ్రామంలో జరిగే బోనాలేనని పేరుంది. సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు (జూలై/ఆగస్టు)లో ముగిసిపోతాయి.         కానీ, చ…

 తెలంగాణలో  చివరి బోనాల పండుగగా మన చందుపట్ల (manachandupatla) గ్రామంలో జరిగే బోనాలేనని పేరుంది. సాధారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు (జూలై/ఆగస్టు)లో ముగిసిపోతాయి.         కానీ, చందుపట్ల గ్రామంలో మాత్రం వందల సంవత్సరాల ఆనవాయితీ ప్రకారం భాద్రపద మాసంలో బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందువల్ల   తెలంగాణలోనే "చివరి బోనాలు" చందుపట్లలో నిర్వహిస్తారు  అని చెబుతుంటారు. 

 భాద్రపద మాసంలోనే ఎందుకు ..

మన చందుపట్ల గ్రామంలో  ఎక్కువగా వ్యవసాయ పంట మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అధికం.  పూర్వం  ఎడ్లబండ్ల తో  ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే వారు .  అయితే ఆషాడం, శ్రావణమాసంలో  వ్యవసాయ పనులు  ఉండడంతో ఆ సమయంలో ఎడ్లు మొత్తం వ్యవసాయ పనులు చేసి అలసిపోవటం వలన వాటి కాళ్లు మెత్తబడటం వల్ల ఎండ్ల బండ్లతో ఊరేగింపుగా వెళ్లే అవకాశం ఉండదని..  వ్యవసాయం పనులు ముగిసిన తరువాత  భాద్రపద మాసంలో  బోనాల పండుగ జరుపుకునే వారట.

 

అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా   వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల తర్వాత భాద్రపదం మాసంలోనే బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.    తెలంగాణ ప్రాంతంలో అంతటా బోనాలు పండుగ అయిపోయిన తర్వాత   బోనాలు జరుపుకునే అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ ఆచిరస్తూ  గ్రామంలో ఇప్పటికీ బాధ్రపద మాసంలో  బోనాల పండుగ నిర్వహించడం విశేషం.