విద్యా చైతన్యానికి నిలయం, ఉద్యోగుల పురిటిల్లు.. ‘చందుపట్ల’ పాఠశాల ఘన చరిత్ర!నల్గొండ జిల్లా చరిత్రలో చందుపట్ల పాఠశాలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. 30 గ్రామాలకు అక్షర వెలుగులు పంచిన చరిత్ర గల బడి మన …
విద్యా చైతన్యానికి నిలయం, ఉద్యోగుల పురిటిల్లు.. ‘చందుపట్ల’ పాఠశాల ఘన చరిత్ర!
నల్గొండ జిల్లా చరిత్రలో చందుపట్ల పాఠశాలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. 30 గ్రామాలకు అక్షర వెలుగులు పంచిన చరిత్ర గల బడి మన ఊరి బడి.. నల్లగొండ తాలూకాలోని గ్రామాల్లో ప్రప్రథమంగా మన గ్రామంలోనే పాఠశాల ఏర్పడినది.

గ్రామానికి వరుసగా మూడు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ రాఘవాచార్యుల గారి హయాంలో ఊరి విద్యా ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని ‘మా ఊరు నాడు నేడు’ చదివితే తెలుస్తుంది. గ్రామ వాస్తవ్యులు టి.నర్సయ్యగుప్త గారి తోడ్పాటుతో పాటు గ్రామ పెద్దల సహకారం, అప్పటి జిల్లా కలెక్టర్ పర్సా వేంకటేశ్వరరావు గారి ప్రత్యేక కృషి ఫలితంగా చందుపట్లకు హైస్కూల్ మంజూరు కాగా.. పాఠశాల నిర్మాణానికి గ్రామంలో స్థలం, కొంత నగదు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండడంతో గ్రామస్తులంతా చందాలు వేసుకుని.. శ్రమదానంతో పాఠశాలను నిర్మించారు. ఆ సమయంలో నల్లగొండ, సూర్యాపేటలో తప్ప ఎక్కడ ఉన్నత పాఠశాలలు లేవు. చుట్టూపక్కల 30 గ్రామాలకు చెందిన పిల్లలు చందుపట్లలో విద్యాభ్యాసం చేసేవారట.ఈ చారిత్రక విద్యాలయ నిర్మాణం వెనుక ఊరి ప్రముఖుల త్యాగం, గ్రామస్తుల ఐక్యత దాగి ఉన్నాయని పలువురు పెద్దలు చెబుతుంటారు.

పాఠశాల నిర్మించిన విస్తారమైన భూభాగాన్ని గ్రామానికి చెందిన మేడవరం లక్ష్మీనర్సయ్య, అంతయ్య, బుచ్చయ్య గార్లు ఉదారంగా విరాళంగా అందించగా.. పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఊరి ప్రజల భాగస్వామ్యానికి అప్పటి జిల్లా కలెక్టర్ సైతం ఆశ్చర్యపోయారట.. అంతటి ఐక్యత గల గ్రామం మనది..
ముఖ్యమంత్రుల రాక: పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, ప్రారంభోత్సవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు విచ్చేయడం మన ఊరి చరిత్రలోనే ఒక సువర్ణాక్షర ఘట్టం.
ప్రస్తుత పాఠశాల వివరాలో త్వరలో...
