ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నకిరేకల్ ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి. నకిరేకల్ చిట్యాల కట్టంగూర్ కేతేపల్లి…
ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో నకిరేకల్ ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి.
చాలా కాలం నియోజకవర్గంలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఇక్కడ అనేకమార్లు విజయం సాధించారు. తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న నాయకులు ఉన్న కారణంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. సుమారు 30 సంవత్సరాల కాలం కమ్యూనిస్టి పార్టీ తరపున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం నకిరేకల్ (SC రిజర్వ్‌డ్) నియోజకవర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ (INC) పార్టీకి చెందిన వేముల వీరేశం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
